ముఖ్యమంత్రి జగన్.. ఇవాళ సాయంత్రం 6 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ కానున్నారు. మంత్రివర్గం పునర్‌వ్యవస్థీకరణే ప్రధాన అంశంగా ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. గురువారం జరగబోయే మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులందరితో రాజీనామా చేయించి.. ఈ నెల 11న కొత్త మంత్రివర్గంతో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో గవర్నర్‌తో సీఎం భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రధానమంత్రి మోదీతో తాజాగా జరిగిన భేటీ తదితర అంశాలపై గవర్నర్‌తో సీఎం చర్చించనున్నట్లు సమాచారం.
CM Jagan: నేడు గవర్నర్ బిశ్వభూషణ్‌తో ముఖ్యమంత్రి జగన్ భేటీ - ముఖ్యమంత్రి జగన్
CM Jagan Meet Governor: ముఖ్యమంత్రి జగన్.. ఇవాళ సాయంత్రం 6 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ కానున్నారు. మంత్రివర్గం పునర్‌వ్యవస్థీకరణే ప్రధాన అంశంగా ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం.
నేడు గవర్నర్‌తో ముఖ్యమంత్రి జగన్ భేటీ