రాష్ట్రానికి 12 వైద్య కళాశాలలు మంజూరు చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్లీకి వెళ్లిన సీఎం శనివారం రాత్రి కేంద్ర మంత్రిని కలిశారు. రాష్ట్రంలో గతంలో 13 జిల్లాలు ఉండగా పాలనా సౌలభ్యం కోసం మరో 13 జిల్లాలు ఏర్పాటు చేశామని వివరించారు. ఇప్పటికే రాష్ట్రంలో 11 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయని, మరో 3 కళాశాలల (పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల) పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. విభజన తర్వాత రాష్ట్రంలో అత్యాధునిక వైద్య సదుపాయాల కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. అందుకే విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, నంద్యాల జిల్లాలకు కొత్తగా కళాశాలలు మంజూరు చేయాలని కోరారు. అనంతరం రాత్రి 8.30 గంటలకు సీఎం విజయవాడ బయలుదేరారు.
రాష్ట్రానికి 12 వైద్య కళాశాలలు మంజూరు చేయండి: సీఎం జగన్ - కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిని కలిసిన సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో దిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వైద్య కళాశాలల ఏర్పాటుపై కేంద్రమంత్రితో చర్చించారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు వైద్య కళాశాలలు మంజూరు చేయాలని కోరారు.
రాష్ట్రానికి 13 వైద్య కళాశాలలు మంజూరు చేయండి
Last Updated : May 1, 2022, 4:10 AM IST