ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీ పట్ల కేఆర్ఎంబీ వివక్ష చూపుతోంది: కేంద్రమంత్రి షెకావత్​కు సీఎం జగన్ లేఖ - కేంద్రమంత్రి లేఖ రాసిన సీఎం జగన్ వార్తలు

cm-jagan-letter
cm-jagan-letter

By

Published : Jul 5, 2021, 12:47 PM IST

Updated : Jul 5, 2021, 3:00 PM IST

12:41 July 05

తెలంగాణ వైఖరితో జలాలను కోల్పోతున్నాం

కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌కు సీఎం జగన్‌ లేఖ రాశారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తోందంటూ మరోసారి ఫిర్యాదు  చేశారు. అక్రమంగా పాలమూరు-రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నారని లేఖలో సీఎం పేర్కొన్నారు. 796 అడుగుల నుంచి కృష్ణా నీటిని తెలంగాణ అక్రమంగా తోడుతోందనన్నారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని సీఎం అన్నారు.

'కేంద్ర జలశక్తి, కేఆర్‌ఎంబీకి ఫిర్యాదులు చేసినా చర్యలు లేవు. ఏపీ పట్ల కేఆర్ఎంబీ వివక్ష చూపుతోంది. తెలంగాణ ఫిర్యాదులపై కేఆర్ఎంబీ వేగంగా స్పందిస్తోంది. ఏపీ ఫిర్యాదులను మాత్రం కేఆర్‌ఎంబీ పట్టించుకోవట్లేదని.. తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులనూ పట్టించుకోవట్లేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పరిశీలనకు ఉత్సాహం చూపిస్తున్న కేఆర్ఎంబీ.. తెలంగాణలోని అక్రమ ప్రాజెక్టులను తొలుత సందర్శించాలి. ఆ తర్వాతే రాయలసీమ లిఫ్ట్ సందర్శించాలి. తెలంగాణ ప్రాజెక్టులను ముందు పరిశీలించేలా కేఆర్ఎంబీని ఆదేశించాలి' అని కేంద్రమంత్రి షెకావత్​కు రాసిన లేఖలో జగన్ పేర్కొన్నారు.

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు పూర్తిచేస్తే శ్రీశైలంలో చుక్కనీరు మిగలదని సీఎం జగన్ లేఖలో ప్రస్తావించారు. తెలంగాణ నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్న జగన్.. మరో అవకాశం లేకే రాయలసీమ ఎత్తిపోతల చేపట్టామని తెలిపారు. సీమ ఎత్తిపోతలతో రోజుకు 3 టీఎంసీలు తరలింపు సాధ్యం అవుతుందన్నారు. ఏపీకి సాగునీరు అవసరం లేనప్పుడు తెలంగాణ విద్యుదుత్పత్తి చేయవద్దని లేఖలో పేర్కొన్నారు. వివక్ష చూపవద్దని కేఆర్‌ఎంబీని ఆదేశించాలని కేంద్రమంత్రి షెకావత్​కు తెలిపారు. కేఆర్ఎంబీ పరిధిని వెంటనే నోటిఫై చేయాలన్నారు. ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ్ బలగాలు మోహరించాలని లేఖలో అన్నారు.

అనుమతులివ్వండి.. ప్రకాశ్‌ జావడేకర్‌కు జగన్ లేఖ

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరుతూ.. ముఖ్యమంత్రి జగన్‌.. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్‌కు లేఖ రాశారు. ప్రాజెక్టు డీపీఆర్​ను జూన్ 30వ తేదీన సీడబ్ల్యూసీకి అప్‌లోడ్ చేశామని వివరించారు. సీమ ఎత్తిపోతలకు భూసేకరణ చేయట్లేదని.. అటవీ ప్రాంతం, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల అడ్డంకుల్లేవని పేర్కొన్నారు. ప్రాజెక్టును పర్యావరణ పరిరక్షణ జోన్‌కు 10 కిలోమీటర్ల వెలుపల నిర్మిస్తామని తెలిపారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు, ఏపీకి జరిగే అన్యాయంపై లేఖలో జగన్‌ ప్రస్తావించారు.

ఇదీ చదవండి:curfew: కర్ఫ్యూ సడలింపుపై సీఎం నిర్ణయం తీసుకోనున్నారా?

Last Updated : Jul 5, 2021, 3:00 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details