తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ..ప్రధాని మోదీకి, కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌కు ముఖ్యమంత్రి జగన్ వేర్వేరుగా లేఖలు రాశారు. ఏపీ ప్రయోజనాలు దెబ్బతినేలా తెలంగాణ వ్యవహరిస్తోందని జగన్ లేఖలో ఫిర్యాదు చేశారు. నీటి వినియోగంపై తెలంగాణ తీరును తప్పుబట్టారు. తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలను ఉల్లంఘించిందని జగన్ ఆక్షేపించారు. విద్యుదుత్పత్తికి ఏకపక్షంగా నీటిని వినియోగిస్తున్నారని..,శ్రీశైలం, సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తిపై ఫిర్యాదు చేశారు.
CM Letter To PM: 'ఏపీ ప్రయోజనాలు దెబ్బతినేలా తెలంగాణ వ్యవహరిస్తోంది' - cm jagan letter to pm modi
ప్రధానికి సీఎం జగన్ లేఖ
20:47 July 01
ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద సీఐఎస్‌ఎఫ్ బలగాలను మోహరించాలని జగన్ ప్రధానిని కోరారు. నీటి వినియోగం, పంపకాల విషయంలో కేఆర్‌ఎంబీ పరిధిని నిర్దేశించాలని విన్నవించారు. తెలంగాణ ఉల్లంఘనలపై కేఆర్‌ఎంబీకి రాసిన లేఖలను కూడా జగన్ జతపరిచారు.
ఇదీచదవండి
AP-TS Water War: తెలుగు రాష్టాల మధ్య జలవివాదం..ప్రాజెక్టుల వద్ద భద్రత పెంపు
Last Updated : Jul 1, 2021, 9:52 PM IST