ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొత్త 108, 104 వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్‌ - ఏపీలో 108, 104 నూతన వాహనాలు

అత్యాధునిక పరికరాలతో రూపుదిద్దుకున్న నూతన 108, 104 వాహనాలు రోడ్డెక్కాయి. 201 కోట్ల రూపాయలతో కొనుగోలు చేసిన 1068 కొత్త వాహనాల సేవలను ముఖ్యమంత్రి జగన్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

cm jagan launch new 104, 108 vehicles in Vijayawada
cm jagan launch new 104, 108 vehicles in Vijayawada

By

Published : Jul 1, 2020, 9:57 AM IST

Updated : Jul 1, 2020, 11:03 AM IST

కొత్త 108, 104 వాహనాలను ప్రారంభించిన సీఎం జగన్‌

ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా 201 కోట్ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన కొత్త 108, 104 వాహనాలను ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. మొత్తం 1068 వాహనాలను విజయవాడలోని బెంజి సర్కిల్‌ వద్ద పచ్చజెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. వాహనాలన్నీ ఒకేసారి పరుగులు పెట్టటంతో కుయ్... కుయ్ శబ్ధాలతో విజయవాడ మార్మోగింది.

మొత్తం వాహనాల్లో 656.. 104 వాహనాలు, 412... 108 వాహనాలు ఉన్నాయి. వీటిని అత్యాధునికంగా రూపొందించారు. 104 వాహనాలను రాష్ట్రవ్యాప్తంగా మండలానికొకటి చొప్పున కేటాయించారు. గిరిజన ప్రాంతాల్లో ఫోన్‌కాల్‌ వచ్చిన 25 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో, పట్టణ ప్రాంతాల్లో 15 నిమిషాల్లో 108 అంబులెన్సు ఘటనా స్థలికి చేరుకునేలా విధివిధానాలు ఖరారు చేశామని వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు.

Last Updated : Jul 1, 2020, 11:03 AM IST

ABOUT THE AUTHOR

...view details