కృష్ణా నది ముంపు నుంచి రక్షణకు విజయవాడలోని కృష్ణలంకలో తలపెట్టిన రిటైనింగ్ వాల్‌కు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. రాణిగారితోట వద్ద జరిగిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సంప్రదాయబద్ధంగా కార్యక్రమం నిర్వహించగా.. సీఎం రిమోట్ ద్వారా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాణం జరిగే తీరు, ప్రజలకు కలిగే ఉపయోగం గురించి సీఎంకు అధికారులు వివరించారు. 125 కోట్ల రూపాయల ఖర్చుతో ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్‌ను నిర్మించనున్నారు.
కృష్ణా నది రిటైనింగ్ వాల్ నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన - సీఎం జగన్ న్యూస్
విజయవాడలోని కృష్ణలంకలో తలపెట్టిన రిటైనింగ్ వాల్‌కు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. సంప్రదాయబద్ధంగా కార్యక్రమం నిర్వహించగా.. సీఎం రిమోట్ ద్వారా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
cm jagan
Last Updated : Mar 31, 2021, 11:59 AM IST