ఇవాళ జెరుసలెం పర్యటనకు ముఖ్యమంత్రి - పర్యటన
సీఎం జగన్ ఇవాళ జెరుసలెం వెళ్లనున్నారు. అక్కడే నాలుగురోజులపాటు ఆయన కుటుంబ సభ్యులు సహా బస చేయనున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు జెరుసలెం బయలుదేరి వెళ్లనున్నారు. జగన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులూ వెళ్లనున్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ సమీపంలోని నివాసానికి జగన్ సహా కుటుంబ సభ్యులు చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని ముంబయి వెళ్తారు. అక్కడి నుంచి విమానంలో నేరుగా జెరుసలెం వెళ్తారు. అక్కడే నాలుగు రోజులపాటు సీఎం జగన్ సహా కుటుంబసభ్యులు బస చేస్తారు. ఈ నెల 5న తిరుగు పయనమవుతారు. జెరుసలేం నుంచి ముంబయికి వచ్చి నేరుగా విజయవాడకు వస్తారు. సీఎం పర్యటన పూర్తి వ్యక్తిగతమని అధికార వర్గాలు తెలిపాయి.