తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో వివిధ ఉద్యోగులు, కార్మిక సంఘాల డైరీలు, క్యాలెండర్లను ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. ఏపీఎన్జీవో అసోసియేషన్ క్యాలెండర్‌ను ఆ సంఘం అధ్యక్షుడు ఎన్.చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి ఆవిష్కరించారు.
ఉద్యోగ, కార్మిక సంఘాల క్యాలెండర్లు ఆవిష్కరించిన సీఎం జగన్ - సీఎం జగన్ తాజా వార్తలు
తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో వివిధ ఉద్యోగులు, కార్మిక సంఘాల డైరీలు, క్యాలెండర్లను ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
![ఉద్యోగ, కార్మిక సంఘాల క్యాలెండర్లు ఆవిష్కరించిన సీఎం జగన్ cm jagan Inaugurate govt union Calendars at cmo](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10216615-798-10216615-1610454139877.jpg)
ఉద్యోగ, కార్మిక సంఘాల క్యాలెండర్లు ఆవిష్కరించిన సీఎం జగన్
ఉపాధ్యాయ సంఘాలైన ఎస్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ క్యాలెండర్, పంచాయతీరాజ్ డిప్లమో ఇంజినీర్స్ అసోషియేషన్, రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోషియేషన్, ఏపీజేఎసీ అమరావతి సహా వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాల వారు రూపొందించిన డైరీలను సీఎం ఆవిష్కరించారు.
ఇదీచదవండి:ఎవరి ప్రయోజనాల కోసం నిమ్మగడ్డ ఆరాటపడుతున్నారు: మంత్రులు