ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని సొంతంగా నియమించుకునేందుకు ఏర్పాటుచేసిన కార్పొరేషన్‌ను సీఎం జగన్ ఇవాళ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన తర్వాత.... రాష్ట్రవ్యాప్తంగా 47వేల మంది సిబ్బందికి నియామక ధ్రువీకరణ పత్రాలను ఆయా జిల్లాల్లో అందించే ఏర్పాట్లు చేశారు. పూర్తి పారదర్శకతతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఏపీసీఓఎస్ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఔట్‌సోర్సింగ్ నియామకాల్లో 50 శాతం మహిళలకే కేటాయించాలని... ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్యర్థులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యాలను సక్రమంగా అమలు చేయడంతోపాటు క్రమం తప్పకుండా జీతాలు చెల్లింపు జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఉదయం 11 గంటలకు ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ప్రారంభం - ఏపీలో ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ తాజా వార్తలు
ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది నియామకం చేసే విధానానికి వైకాపా సర్కార్ చెక్ పెట్టింది. ప్రభుత్వ శాఖల్లో అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని సొంతంగా నియమించుకునే ఏర్పాటు చేసింది. దీనికోసం కొత్తగా అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్‌ను ఇవాళ ప్రారంభించనుంది.
cm jagan inagurate out sourcing corporation