ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తదుపరి విచారణలో వాదనలు వినిపించాలి: సీబీఐ కోర్టు - సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ

జగన్ అక్రమాస్తుల కేసులోని రఘురాం సిమెంట్స్ ఛార్జ్ షీట్​లో అభియోగాల నమోదుపై తదుపరి విచారణలో వాదనలు వినిపించాలని నిందితులకు హైదరాబాద్ సీబీఐ న్యాయస్థానం స్పష్టం చేసింది. విచారణకు గడువు కావాలని నిందితులు కోరగా అంగీకరించిన న్యాయస్థానం.. తదుపరి విచారణ ఈనెల 25కి వాయిదా వేసింది.

cm jagan illegal case
సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ

By

Published : Jan 20, 2021, 6:59 PM IST

Updated : Jan 20, 2021, 8:17 PM IST

హైదరాబాద్‌ సీబీఐ కోర్టు.. జగన్ అక్రమాస్తుల కేసులో రఘురాం సిమెంట్స్ ఛార్జ్‌షీట్‌లో అభియోగాల నమోదుపై విచారణ చేపట్టింది. అభియోగాల నమోదుపై తదుపరి విచారణలో వాదనలు వినిపించారని నిందితులకు న్యాయస్థానం స్పష్టం చేసింది. రఘురాం సిమెంట్స్ అభియోగపత్రంపై విచారణ ప్రారంభించాలని నిర్ణయించిన సీబీఐ కోర్టు.. సీఎం జగన్, విజయసాయిరెడ్డి మినహా మిగతా నిందితులు మొదట వాదించాలని గత వాయిదాలో స్పష్టం చేసింది. అయితే సుప్రీంకోర్టు న్యాయవాది వాదిస్తారని.. కొంత సమయం ఇవ్వాలని రఘురాం సిమెంట్స్, జెల్లా జగన్మోహన్ రెడ్డి తరఫు న్యాయవాది కోరారు.

తమకు కూడా గడువు ఇవ్వాలని మిగతా నిందితులు.. గనుల శాఖ మాజీ అధికారులు వీడీ రాజగోపాల్, ప్రభుషెట్టార్, విశ్రాంత ఐఏఎస్ అధికారి కృపానందం, శంకర్ నారాయణ్ కోరారు. అంగీకరించిన న్యాయస్థానం తదుపరి విచారణలో కచ్చితంగా వాదనలు నినిపించాలని.. లేనిపక్షంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. రఘురాం సిమెంట్స్ ఛార్జ్ షీట్​పై విచారణను ఈనెల 25కి కోర్టు వాయిదా వేసింది.

ఇదీ చదవండి:పోలీసు వ్యవస్థను అపహాస్యం చేస్తున్నారు: దేవినేని

Last Updated : Jan 20, 2021, 8:17 PM IST

ABOUT THE AUTHOR

...view details