ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తొలుత ఈడీ కేసులు విచారించాలనే నిర్ణయంపై సుప్రీంకోర్టుకు వెళ్తాం: విజయసాయి - మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్​పై సీబీఐ కోర్టులో విచారణ వాయిదా

cm-jagan-illegal-assets-case
ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

By

Published : Aug 23, 2021, 6:10 PM IST

Updated : Aug 23, 2021, 8:33 PM IST

18:05 August 23

సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

  హైదరాబాద్​లోని సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఈడీ కేసులను ముందుగా విచారణ జరపాలన్న నిర్ణయంపై సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్లు కోర్టుకు ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ కేసులో సీబీఐ కేసుల కంటే ముందుగా ఈడీ కేసుల విచారణ జరపాలని సీబీఐ, ఈడీ కోర్టు నిర్ణయించింది. సీబీఐ కోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ.. ఇటీవల తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రతుల కోసం ఎదురు చూస్తున్నామని.. అవి అందగానే సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ మెమో దాఖలు చేశారు. అప్పటివరకు ఈడీ కేసులపై విచారణ వాయిదా వేయాలని కోరారు. స్పందించిన సీబీఐ కోర్టు.. ఈడీ కేసులపై విచారణను సెప్టెంబరు 1కి వాయిదా వేసింది. 

పెన్నా కేసులో సీఎం జగన్​ డిశ్చార్జ్ పిటిషన్​పై కౌంటరు దాఖలు కోసం సీబీఐ మరోసారి గడువు కోరింది. ఇందూ టెక్ జోన్ కేసులో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని తొలగించవద్దని కోర్టును సీబీఐ కోరింది. ఐటీ మంత్రిగా సబిత ప్రమేయంపై ఆధారాలున్నాయని కోర్టు పేర్కొంది. దీంతో సబిత డిశ్చార్జ్ పిటిషన్​పై విచారణ ఈనెల 27కి వాయిదా పడింది. 

ఇదీ చదవండి..

HC: ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి ఆగ్రహం.

Last Updated : Aug 23, 2021, 8:33 PM IST

ABOUT THE AUTHOR

...view details