కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంటే... ప్రభుత్వం మాత్రం ముందు జాగ్రత్తలు తీసుకోవడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు. స్థానిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోబోయే కోట్లాదిమంది ప్రజలను.. వైరస్ బారి నుంచి రక్షించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందో తెలపాలన్నారు. తాడేపల్లి రాజాప్రసాదంలో సీఎం ఇంకెంతకాలం దాక్కుంటారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఈ విషయంపై 24 గంటల్లో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా వల్ల ఎవరు మృతి చెందినా అందుకు ముఖ్యమంత్రిదే బాధ్యత అని హెచ్చరించారు.
'కరోనాతో ఎవరైనా చనిపోతే.. ముఖ్యమంత్రిదే బాధ్యత'
రాష్ట్రంలో కరోనాతో ఎవరు మరణించినా.. ముఖ్యమంత్రిదే బాధ్యత అన్నారు మాజీ మంత్రి దేవినేని ఉమ. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవడం లేదని ఆగ్రహించారు.
మాజీ మంత్రి దేవినేని ఉమా