cm jagan going to visit governor: ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు సీఎం జగన్ రాజ్‌భవన్ వెళ్లనున్నారు. ఇటీవలే కొవిడ్ నుంచి కోలుకున్న గవర్నర్ బిశ్వభూషణ్‌ను సీఎం జగన్ పరామర్శించనున్నారు.
cm jagan going to visit governor: గవర్నర్ బిశ్వభూషణ్‌ను పరామర్శించనున్న సీఎం జగన్ - bishwbhushan
ఈ రోజు సాయంత్రం సీఎం జగన్ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్‌ను కలవనున్నారు. ఇటీవలే కొవిడ్ నుంచి కోలుకున్న గవర్నర్ బిశ్వభూషణ్‌ను సీఎం పరామర్శించనున్నారు.
![cm jagan going to visit governor: గవర్నర్ బిశ్వభూషణ్‌ను పరామర్శించనున్న సీఎం జగన్ cm jagan going to visit governor](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13909749-435-13909749-1639539701621.jpg)
నవంబర్ 17న దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (AP governor) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గత నెల 23న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. నవంబర్ 28న మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానంలో తరలించారు. స్వల్ప అస్వస్థతకు గురికావడంతో స్థానికంగా ఉన్న ఓ డయాగ్నిస్టిక్ సెంటర్‌లో పరీక్షలు నిర్వహించిన అనంతరం...ఆయన్ని హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి(ap Governor shifted to AIG Hospital at Hyderabad) తరలించారు. ఇటీవల గవర్నర్ కరోనా బారినపడి కోలుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్.. గవర్నర్‌ను కలిసి పరామర్శించనున్నారు.
ఇదీ చదవండి: