ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించి సీఎం.. గవర్నర్‌కు వివరించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని రాజకీయ అంశాలపైనా గవర్నర్‌తో చర్చించనునట్లు సమాచారం. ప్రభుత్వ వర్గాలు మాత్రం మర్యాదపూర్వక భేటీ అని అంటున్నాయి.
గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ.. విగ్రహాల ధ్వంసంపై వివరణ ఇచ్చే అవకాశం - cm jagan meet governor
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను సీఎం జగన్ కలిశారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడుల అంశంపై వివరించనున్నట్లు సమాచారం.

cm jagan going to meet governor on idol demolish issue
గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ
Last Updated : Jan 4, 2021, 6:12 PM IST