ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM JAGAN: 26 నెలలుగా ప్రజారంజకమైన పాలన: జగన్​ - ఆంధ్రప్రదేశ్ న్యూస్ అప్​డేట్స్

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రాష్ట్రప్రభుత్వం స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జెండా ఆవిష్కరించిన అనంతరం సీఎం జగన్​ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. లోపాలు సరిదిద్దుకుని కొత్త బాటలు వేసుకునేందుకు ఇది సరైన సందర్భమని జగన్​ అన్నారు.

cm flag
cm flag

By

Published : Aug 15, 2021, 9:21 AM IST

Updated : Aug 16, 2021, 5:42 AM IST

గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి.. 500కు పైగా పౌర సేవలతో దేశంలో సరికొత్త విప్లవాన్ని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా.. రాబోయే తరం అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాల వ్యవస్థలో మార్పులు చేస్తున్నామన్నారు. మహిళల భద్రత కోసం దిశ బిల్లు, పోలీసుస్టేషన్లు, యాప్‌ రూపొందించామని వివరించారు.

26 నెలలుగా ప్రజారంజకమైన పాలన: జగన్​

26 నెలల తమ పాలనలో రాష్ట్ర చరిత్ర, గతిని మార్చేలా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. గత ఏడాదిన్నర కాలంలో అత్యంత గడ్డుకాలాన్ని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని, కంటికి కనిపించని శత్రువుతో పోరాడామని చెప్పారు. ‘కొవిడ్‌ దాడితో ప్రభుత్వానికి కష్టాలొచ్చాయి. గత 16 నెలల్లో ఆశించిన స్థాయిలో ఆదాయం రాలేదు. వ్యయం పెరిగింది. అవినీతి, వివక్షకు తావులేకుండా ప్రతి రూపాయీ నేరుగా ప్రజలకే ఇచ్చాం’ అని పేర్కొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు.

26 నెలలుగా ప్రజారంజకమైన పాలన: జగన్​

పోలీసు అధికారులకు పతకాలను ప్రదానం చేసి ప్రసంగించారు.

*2వేల మందికి పౌర సేవలందించే సచివాలయం, అక్కడి నుంచి నాలుగడుగులు వేస్తే రైతు భరోసా కేంద్రం, మరో నాలుగడుగులు వేస్తే వైఎస్సార్‌ గ్రామ క్లినిక్‌, ఆంగ్ల మాధ్యమ పాఠశాల, అదే గ్రామంలో డిజిటల్‌ గ్రంథాలయం, ఆంగ్లంలో బోధించే పూర్వ ప్రాథమిక, ఫౌండేషన్‌ బడులు, ప్రతి మండలానికీ అధునాతన 108, ప్రతి పీహెచ్‌సీకి అనుసంధానంగా 104... ఇదీ ప్రభుత్వం మార్చిన, మార్చబోతున్న గ్రామ స్వరూపం.

*ప్రభుత్వ ఉద్యోగులకు చేయాల్సినవి మరికొన్ని ఉన్నాయి. వారికి న్యాయం జరిగేలా రాబోయే రోజుల్లో మరిన్ని నిర్ణయాలు తీసుకుంటాం. అంగన్‌వాడీలు, ఆశా, పారిశుద్ధ్య కార్యకర్తలు.. ఇలా చాలీచాలని వేతనాలతో బతుకుబండి ఈడుస్తున్న 7,02,656 మందికి వేతనాలను పెంచాం.

*26 నెలల్లో 1.84 లక్షల శాశ్వత ఉద్యోగాలిచ్చాం. 1.3 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వంలో విలీనమైన 52వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు, 2.7 లక్షల మంది వాలంటీర్లు కళ్లెదుటే కనిపిస్తున్నారు. 95,212 మంది ఒప్పంద ఉద్యోగులకు ఆప్కాస్‌ ద్వారా న్యాయం చేశాం. 20 వేల మందికి కాంట్రాక్టు ఉద్యోగాలిచ్చాం.

మద్య నియంత్రణ దిశగా అడుగులు

*కుటుంబాల్లో సంతోషం నింపేందుకు మద్య నియంత్రణ దిశగా అడుగులు వేస్తున్నాం.

*అమ్మ ఒడి ద్వారా రెండేళ్లలో రూ.13,023 కోట్లు అందించడంతో ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో ప్రవేశాలు పెరిగాయి.

*రాష్ట్రంలో 11 బోధనాసుపత్రులుండగా.. మరో 16 ఆసుపత్రులు నిర్మిస్తున్నాం. కొవిడ్‌పై యుద్ధంలో భాగంగా పరీక్షలు, చికిత్సల్లో దేశంలో అగ్రగామిగా ఉన్నాం.

మహిళల చేతుల్లో రూ.3 లక్షల కోట్ల సంపద

వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చాం. 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఒక్కో ఇంటి విలువ రూ.5-10 లక్షలు అనుకుంటే 31 లక్షల మంది మహిళల చేతుల్లో రూ.2-3 లక్షల కోట్ల సంపద ఉంచుతున్నాం.

ఆంగ్ల మాధ్యమంలోకి విద్య

ప్రభుత్వ బడులను సీబీఎస్‌ఈ సిలబస్‌తో, ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తున్నాం.

సాగుకు సాయం

వ్యవసాయంపై రూ.83వేల కోట్ల వ్యయం చేశాం. 52.38 లక్షల మంది రైతులకు రూ.17,030 కోట్లు ఇచ్చాం.

ఇదీ చదవండి:ఎర్రకోటపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ప్రధాని మోదీ

Last Updated : Aug 16, 2021, 5:42 AM IST

ABOUT THE AUTHOR

...view details