ఎవరో ఆర్డర్లు రాసి పంపిస్తే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చదివి వినిపిస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు. సీఎస్, హెల్త్ సెక్రటరీని కూడా అడగకుండా నిర్ణయం తీసుకున్నారన్నారు. రాష్ట్రంలో వైద్యఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయో సెక్రటరీని అడగాలి కదా అని పేర్కొన్నారు. పది రోజుల్లో పూర్తయ్యే ఎన్నికలను 6 వారాలు వాయిదా వేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తీసుకొచ్చిన మనిషి అయినంత మాత్రాన ఇంత వివక్ష చూపుతారా? జగన్ ప్రశ్నించారు.
'తనకున్న బలంతో చంద్రబాబు అన్ని వ్యవస్థలను దిగజార్చుతున్నారు. రాష్ట్రానికి రావల్సిన నిధులను అడ్డుకునేందుకు చంద్రబాబు కుట్రలు పన్నుతారు. తనను గెలిపించలేదనే అక్కసుతో చంద్రబాబు ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నారు. రాష్ట్రానికి రావల్సిన నిధులు నిలిచిపోతే చంద్రబాబుకు కలిగే ప్రయోజనం ఏమిటీ?. చంద్రబాబు చర్యల వల్ల అంతిమంగా ప్రజలకు, రాష్ట్రానికే నష్టం కలుగుతోంది. చంద్రబాబు వైఖరి గురించి గవర్నర్‌కు వివరించాం. ఇప్పటికైనా చంద్రబాబు మారకపోతే విషయాన్ని పైస్థాయికి తీసుకెళ్తాం'. అని జగన్ వ్యాఖ్యానించారు.