CM Jagan delhi tour: ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల దిల్లీ పర్యటన పర్యటన ముగిసింది. ఇవాళ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన జగన్.. 15 నిమిషాలపాటు ఆయనతో సమావేశమై చర్చించారు. అక్కడినుంచి సీఎం జగన్.. నేరుగా దిల్లీ విమానాశ్రయానికి బయల్దేరారు.
CM Jagan Delhi Tour: ముగిసిన సీఎం జగన్ దిల్లీ పర్యటన
CM Jagan delhi tour: ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటన పర్యటన ముగిసింది. ఇవాళ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిసిన జగన్... 15 నిమిషాలపాటు ఆయనతో సమావేశమై చర్చించారు. అక్కడినుంచి సీఎం జగన్.. నేరుగా దిల్లీ విమానాశ్రయం బయల్దేరి వెళ్లారు.
CM Jagan Meet PM Modi: ఆర్థికంగా ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించడానికి దిల్లీ వచ్చిన ముఖ్యమంత్రి మంగళవారం సాయంత్రం ప్రధానితో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సాయంత్రం 4.45 గంటలకు ప్రధాని నివాసానికి వెళ్లిన ఆయన 6.05 గంటలకు బయటికొచ్చారు. తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది. పోలవరం సవరించిన అంచనాలు, రేషన్ పెంపు, భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుమతులు, కడప స్టీల్‌ప్లాంట్, రెవెన్యూలోటు భర్తీ, తెలంగాణ నుంచి విద్యుత్తు బకాయిలు, రాష్ట్ర రుణ పరిమితిపై వెసులుబాటు కల్పించాలని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు పేర్కొంది. రాత్రి 7.30 గంటలకు ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్, 8.30 గజేంద్రసింగ్ షెకావత్, 9.30 గంటలకు హోంమంత్రి అమిత్‌షాలతోనూ సీఎం భేటీ అయ్యారు.