CM Jagan Meet Governer: రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై.. గవర్నర్‌తో సీఎం జగన్ చర్చ - గవర్నర్ బిశ్వభూషణ్ వార్తలు
17:44 October 28
తెదేపా కార్యాలయాలపై దాడులకు దారితీసిన అంశాలను వివరించిన సీఎం
రాజ్ భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్‌ను సీఎం జగన్ దంపతులు కలిశారు. పలు అంశాలపై 40 నిమిషాల పాటు గవర్నర్‌తో చర్చించారు. నవంబర్ 1న జరుగనున్న వైఎస్ఆర్ లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డుల ప్రదానోత్సవానికి ముఖ్యఅతిథిగా రావాలని గవర్నర్‌ను ఆహ్వానించారు. అవార్డుల ఇవ్వడంలో ముఖ్య ఉద్దేశం సహా ఎంపిక చేసిన వ్యక్తుల వివరాలను గవర్నర్‌కు తెలిపారు.
అలాగే.. రాష్ట్రంలో తెదేపా కార్యాలయాలపై దాడులకు దారితీసిన అంశాలను గవర్నర్‌కు సీఎం జగన్ వివరించారు. తనపై తెదేపా నేతలు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన సీడీలు, ఆధారాలను గవర్నర్ కార్యాలయానికి అందించినట్లు తెలిసింది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిమాణాలపై గవర్నర్ బిశ్వభూషణ్‌తో సీఎం జగన్ చర్చించారు. శాసన సభలో సమావేశాల నిర్వహణపై గవర్నర్‌తో చర్చించిన సీఎం.. శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లుల వివరాలను గవర్నర్‌కు తెలియజేశారు.
ఇదీ చదవండి