National Handloom Day: నూలు దారాలతో కళాఖండాలు సృష్టించి ప్రపంచాన్ని అబ్బురపరిచిన చరిత్ర మన చేనేత కార్మికులది అని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. స్వాతంత్య్ర ఉద్యమంలో జాతి మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకురావటంలో ప్రధాన భూమిక పోషించిన ఘనత చేనేత సొంతమని కొనియాడారు. చేనేత కార్మికదినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్.. నేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. చేనేతల సంక్షేమం కోసం 'నేతన్న హస్తం' పథకం ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని అన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
ప్రపంచాన్ని అబ్బురపరిచిన చరిత్ర.. మన చేనేత కార్మికులది: సీఎం జగన్ - చేనేత కార్మికుల దినోత్సవం
National Handloom Day: చేనేత కార్మికదినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి జగన్.. నేతన్నలకు శుభాకాంక్షలు తెలిపారు. నూలు దారాలతో కళాఖండాలు సృష్టించి ప్రపంచాన్ని అబ్బుపరిచిన చరిత్ర మన చేనేత కార్మికులది అని కొనియాడారు.
సీఎం జగన్