మాజీ ఎమ్మెల్యే ద్రోణం రాజు శ్రీనివాస్ మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. మృదువైన స్వభావం, నిబద్ధత కలిగిన నాయకుడని శ్రీనివాస్‌ను కొనియాడారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ద్రోణం రాజు కుటుంబం కీలక పాత్ర పోషించిందని తెలిపారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
మాజీ శాసనసభ్యులు ద్రోణంరాజు శ్రీనివాస్ మృతికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. ఆయన మరణం విచారకరమన్నారు. ద్రోణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.