ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 15, 2020, 11:35 AM IST

ETV Bharat / city

త్వరలోనే మూడు రాజధానులకు శంకుస్థాపన చేస్తాం: సీఎం జగన్

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే 3 రాజధానుల బిల్లును చట్టంగా మార్చామని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయజెండా ఆవిష్కరించిన ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రత్యేక హోదా సాధించే వరకు కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పారు.

jagan
jagan

త్వరలోనే మూడు రాజధానులకు శంకుస్థాపన చేస్తాం: సీఎం జగన్

74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్‌ జాతీయజెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. విభజన గాయాలు మానాలన్నా.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగాలన్నా పాలన వికేంద్రీకరణతోనే సాధ్యమన్నారు. అందుకే మూడు రాజధానుల బిల్లులను చట్టంగా మార్చామని స్పష్టం చేశారు.

పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చిన ప్రత్యేకహోదాను సాధించేవరకు పోరాటం ఆపమని సీఎం జగన్‌ ఉద్ఘాటించారు. భవిష్యత్తులో కేంద్రం మనసు మార్చుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర నీటి ప్రయోజనాల విషయంలో రాజీలేని ధోరణిని ఆచరణలో చూపుతున్నామని సీఎం అన్నారు. 2022 ఖరీఫ్‌ నాటికి పోలవరం పూర్తిచేస్తామని స్పష్టం చేశారు.పేదల సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా.. కనీవినీ ఎరగని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని సీఎం అన్నారు.

ఇదీ చదవండి:
'వ్యవసాయమే 'ఆత్మనిర్భర్​ భారత్​' తొలి ప్రాధాన్యం'

ABOUT THE AUTHOR

...view details