హైదరాబాద్ సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. ఇందూ టెక్‌జోన్ కేసులో జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై విచారించింది. దర్యాప్తు స్థితిని ముందుగా సీబీఐ వెల్లడించాలని జగన్ తరపు న్యాయవాది కోరారు. దర్యాప్తు పూర్తయిందని సీబీఐ మెమో దాఖలు చేసేలా ఆదేశించాలన్నారు. అవసరమైతే మరిన్ని దస్త్రాలు సమర్పిస్తామని సీబీఐ చెప్పిందని వివరించారు. అయితే దర్యాప్తు స్థితిపై వివరాల వెల్లడికి రెండ్రోజుల గడువు కావాలని సీబీఐ కోరింది. దీంతో ఇందూ టెక్‌జోన్ ఛార్జ్‌షీట్‌పై విచారణను ధర్మాసనం ఈ నెల 11కి వాయిదా వేయగా... ఇండియా సిమెంట్స్ కేసు విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది.
jagan ED case : హైదరాబాద్ సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ - cm jagan cbi case inquiry
హైదరాబాద్ సీబీఐ కోర్టులో ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. ఇందూ కేసులో దర్యాప్తు స్థితిని ముందుగా వెల్లడించాలని సీబీఐని జగన్ తరఫు న్యాయవాది కోరారు. తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 11కి వాయిదా వేసింది.
జగన్ అక్రమాస్తుల కేసు