ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్ ఆస్తుల కేసు విచారణ ఈనెల 27కు వాయిదా - సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు

హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టులో సీఎం జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ ఈనెల 27కి వాయిదా పడింది. నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులోని ఈడీ కేసును నవంబరు 9కి వాయిదా వేశారు.

cm jagan case hearings postpone in hyderabad cbi court
సీబీఐ కోర్టులో సీఎం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ ఈనెల 27కు వాయిదా

By

Published : Oct 20, 2020, 2:45 PM IST

హైదరాబాద్ సీబీఐ, ఈడీ కోర్టులో రాష్ట్ర సీఎం జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ ఈనెల 27కు వాయిదా పడింది. సీబీఐ, ఈడీ కోర్టు న్యాయమూర్తి ఇవాళ సెలవులో ఉన్నారు. కేసు తదుపరి విచారణను ఇంఛార్జ్ న్యాయమూర్తి ఈనెల 27కి వాయిదా వేశారు.

నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులోని ఈడీ కేసు నవంబరు 9కి వాయిదా పడింది. అరబిందో, హెటిరో సంస్థలకు భూకేటాయింపులకు సంబంధించిన ఈ కేసును కూడా సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ జగతి పబ్లికేషన్స్ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో పెండింగ్​లో ఉంది. నవంబరు 5న హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉందని న్యాయవాదులు తెలిపిన మేరకు.. తదుపరి విచారణను నాంపల్లి కోర్టు నవంబరు 9కి వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details