ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్​ను కలిసిన ఎమ్మెల్యే కేతిరెడ్డి.. తాడిపత్రి ఘటనపై వివరణ - తాడిపత్రి వివాదం తాజా వార్తలు

తాడిపత్రి వివాదంపై దృష్టి పెట్టిన సీఎం జగన్.. ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తన క్యాంపు కార్యాలయానికి పిలిపించారు. ఘటనకు దారితీసిన పరిణామాలను సీఎంకు కేతిరెడ్డి వివరించగా.... ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని సీఎం సూచించినట్లు సమాచారం.

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పిలిపించిన సీఎం
తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పిలిపించిన సీఎం

By

Published : Jan 5, 2021, 1:55 PM IST

Updated : Jan 5, 2021, 10:37 PM IST

తాడిపత్రిలో ఉద్రిక్తతలకు దారితీసిన దాడి ఘటనపై ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సీఎంకు వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇవాళ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆయన... ముందుగా అనంతపురం జిల్లా ఇన్‌ఛార్జ్‌ మంత్రి బొత్స, జిల్లా పర్యవేక్షకుడు సజ్జలను కలిసి వివరణ ఇచ్చారు. అనంతరం సీఎంతో భేటీ అయ్యారు. తాడిపత్రిలో జరిగిన పరిణామాలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఘటనకు దారితీసిన పరిణామాలను సీఎంకు కేతిరెడ్డి వివరించగా.... ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని సీఎం సూచించినట్లు సమాచారం. మధ్యాహ్నం 12 గంటలకు క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే సాయంత్రం 6 గంటల వరకు కార్యాలయంలోనే ఉన్నారు. అయితే... వ్యక్తిగత పనుల నిమిత్తమే సీఎం కార్యాలయానికి వచ్చానని ఆయన చెప్పారు.

Last Updated : Jan 5, 2021, 10:37 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details