ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CM JAGAN: క్రీడాకారులను అభినందించిన ముఖ్యమంత్రి జగన్

CM JAGAN: అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర ప్రతిష్టను వెలుగెత్తిచాటిన భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్, ఇండియన్‌ డెఫ్ ఒలింపిక్స్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రిన్‌ను ముఖ్యమంత్రి జగన్​ అభినందించారు. ప్రభుత్వం తరపున వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని సీఎంవో అధికారులకు సూచించారు.

CM JAGAN
క్రీడాకారులను అభినందించిన ముఖ్యమంత్రి జగన్

By

Published : Jun 24, 2022, 5:19 PM IST

CM JAGAN:భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్, ఇండియన్‌ డెఫ్ ఒలింపిక్స్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాప్రిన్‌ను ముఖ్యమంత్రి జగన్​ అభినందించారు. అంతర్జాతీయ వేదికలపై రాష్ట్ర ప్రతిష్టను వెలుగెత్తిచాటడంపై ప్రశంసించారు. షేక్‌ జాప్రిన్‌ అర్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రతిభను చాటిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు ఇచ్చే నగదు ప్రోత్సాహకం ఇవ్వాలన్నారు.

శ్రీకాంత్, జాఫ్రిన్‌ను ముఖ్యమంత్రి ఘనంగా సన్మానించారు. ప్రభుత్వం తరపున వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని సీఎంవో అధికారులకు సూచించారు. ప్రభుత్వం క్రీడాకారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ, వారిని ప్రోత్సహిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ఇదే స్ధాయిలో గెలిచి ఆంధ్రప్రదేశ్​కు పేరు, ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఏపీ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ తరపున సీఎం జగన్‌కు బ్యాడ్మింటన్‌ కిట్​ను ప్రెసిడెంట్‌ ముక్కాల ద్వారకానాథ్‌ అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి రోజా, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్ధ్‌ రెడ్డి, శాప్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ జూన్‌ గ్యాలియట్ పాల్గొన్నారు.

కిదాంబి శ్రీకాంత్​:2024 ఒలింపిక్స్ లక్ష్యంగా సన్నద్ధమవుతున్నట్లు బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు శ్రీకాంత్‌ తెలిపారు. ఒలింపిక్స్ క్రీడల్లో దేశానికి పతకం సాధించేలా కృషి చేస్తున్నానని అన్నారు. థామస్ కప్‌లో విజయం సాధించిన సందర్భంగా శ్రీకాంత్‌.. సీఎం జగన్‌ను కలిశారు. రాష్ట్ర స్పోర్ట్స్ పాలసీలో థామస్ కప్‌ను భాగం చేస్తామని సీఎం హామీ ఇచ్చారన్న శ్రీకాంత్‌.. తిరుపతిలో బ్యాడ్మింటన్‌ అకాడమీ ఏర్పాటుపై త్వరలోనే దృష్టి సారిస్తానని చెప్పారు.

2024 ఒలింపిక్స్ లక్ష్యంగా సన్నద్ధమవుతున్నట్లు తెలిపిన కిదాంబి శ్రీకాంత్

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details