రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేపట్టారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని నందిగామ, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, తాడికొండ నియోజకవర్గాల్లో సీఎం సర్వే నిర్వహించారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను వీహంగ వీక్షణం ద్వారా మంత్రులు సుచరిత, కొడాలి నాని, సీఎస్ నీలం సాహ్నితో కలిసి పరిశీలించారు. ముంపు ప్రాంతాలు, దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.
పంట నష్టంపై అంచనాలు పూర్తి చేయండి..
ఏరియల్ సర్వే అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన జగన్...పంట నష్టంపై వెంటనే అంచనాలు పూర్తి చేయాలన్నారు. వీలైనంత త్వరగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని ఆదేశించారు. సకాలంలో ఇన్పుట్ సబ్బిడీ ఇస్తే రబీలో పంట పెట్టుబడికి ఉపయోగపడుతుందన్నారు. పంటలు, ఇళ్లు, పశువులు నష్టపోయిన వారికి వెంటనే పరిహారం ఇవ్వాలన్నారు.