ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులున్నా.. ఉద్యోగులను సంతృప్తి పరిచే నిర్ణయాలే తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. విజయవాడలో ఏపీ ఎన్జీవో మాజీ అధ్యక్షుడు అశోక్బాబు ఆత్మీయ వీడ్కోలు సభలో పాల్గొన్న సీఎం... ధనిక రాష్ట్రాల కన్నా అధికంగా ఉద్యోగులకు లబ్ధి చేకూర్చామని పేర్కొన్నారు. ఉద్యోగులు... ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. విభజన వల్ల జరిగిన నష్టాన్ని గుర్తుచేశారు.
ఉద్యోగులకు సంతృప్తినిచ్చే నిర్ణయాలే తీసుకుంటా: చంద్రబాబు - HYDERABAD
ప్రపంచమంతా తిరిగి హైదరాబాద్‌కు ఐటీ పరిశ్రమలు తీసుకువచ్చానని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేశారు.
ఆత్మీయ సభలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
న్యాయ సమ్మతంగా విభజన జరగాలని చెప్పానన్న సీఎం... రూ.16 వేల కోట్లు ఇస్తామని చెప్పి కేవలం రూ.3 వేల కోట్లు ఇచ్చారని వివరించారు. పరిశ్రమలు రాకపోతే రాష్ట్రానికి ఆదాయం రాదని... ప్రపంచమంతా తిరిగి హైదరాబాద్‌కు ఐటీ పరిశ్రమలు తీసుకువచ్చానని గుర్తుచేశారు. ఆర్నెళ్లలో నీటి వసతి కల్పిస్తామని హామీ ఇస్తేనే కియా పరిశ్రమ రాష్ట్రానికి వచ్చిందన్న చంద్రబాబు...సేవారంగం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుందని తెలిపారు.