ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బలహీనవర్గాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి.. జగ్జీవన్ రాం' - జగ్జీవన్ రాం

బడుగు, బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో షెడ్యూల్ కులాలకు అన్ని విధాలా న్యాయం చేస్తున్నామని సీఎం తెలిపారు.

'బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి జగ్జీవన్ రాం'

By

Published : Apr 5, 2019, 5:08 PM IST

బడుగు, బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బాబు జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా విజయవాడ రామవరప్పాడు కూడలి వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

రాష్ట్రంలో షెడ్యూల్ కులాలకు అన్ని విధాలా ‌న్యాయం చేస్తున్నామని... వారి పిల్లలు ఉన్నత విద్య అభ్యసించేందుకు, ఉపాధి అవకాశాలు పొందేందుకు పూర్తి చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.

'బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి జగ్జీవన్ రాం'

ఇదీ చదవండి..... తెలుగు జాతితో పెట్టుకుంటే పాతాళానికి పోతారు: సీఎం

ABOUT THE AUTHOR

...view details