గెలుపోటముల కన్నా ప్రజాస్వామ్య రక్షణే ముఖ్యం - lawyers
ప్రస్తుత ప్రజాస్వామ్యంలో సామాన్య పౌరులు రాజకీయాల్లో పోటీ చేయలేకపోతున్నారు. డబ్బు ఖర్చు పెట్టే చాలా చోట్ల కొందరు విజయం సాధిస్తున్నారు. డిజిటల్ కరెన్సీ ఈ సమస్యకు పరిష్కారం చూపుతుంది: చంద్రబాబు
భారత్‌లో 'ఎన్నికల విధానం - జవాబుదారీతనం' అంశంపై దిల్లీలోని ఐఐసీలో సదస్సు జరిగింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్, ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు పలువురు ప్రముఖులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన 500, 2000 నోట్లు కారణంగా అవినీతి మరింత పెరిగిందని అన్నారు. పెద్ద నోట్ల కారణంగా రాజకీయ నాయకులు డబ్బు పంచేందుకు సులభమైందని విమర్శించారు. డిజిటల్ కరెన్సీ ద్వారా మాత్రమే ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయొచ్చని చంద్రబాబు అన్నారు. అందరూ వ్యక్తిగత జీవితాల గురించే ఆలోచిస్తున్నారని దాని వల్లే రాజకీయాల్లోకి వచ్చే వారి సంఖ్య తగ్గుతుందని అన్నారు. సమాజం బాగుండాలంటే ప్రజలు రాజకీయాల్లోకి రావాలని సూచించారు. ఎన్నికల్లో గెలుపోటముల కన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం ముఖ్యమైన అంశమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు