కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోర్టుల మూసివేతను సెప్టెంబరు 5 వరకు కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది. జిల్లా కోర్టులు, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, జిల్లా న్యాయసేవాధికార సంస్థలు, ట్రైబ్యునళ్లు, జ్యుడిషియల్ అకాడమీల్లో సెప్టెంబరు 5 వరకు రెగ్యులర్ విధులను నిలిపివేస్తున్నట్లు రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వరరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్, క్రిమినల్ వ్యవహారాల్లో అత్యవసర కేసుల విచారణ యథావిధిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొనసాగుతుందని తెలిపారు. జ్యుడిషియల్ అకాడమీ తరగతులు ఆన్‌లైన్‌లో జరుగుతాయన్నారు.
సెప్టెంబరు 7న క్లాట్