Clash between Trs and Bjp: తెలంగాణలోని జనగామ జిల్లాలో తెరాస శ్రేణుల సంబురాలు గొడవకు దారి తీశాయి. పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో తెరాస, భాజపా నాయకుల మధ్య ఘర్షణ జరిగింది.
తెరాస, భాజపా శ్రేణుల మధ్య ఘర్షణ.. ఎందుకంటే ? - తెరాస, భాజపా శ్రేణుల మధ్య ఘర్షణ
Clash between TRS and BJP: తెలంగాణలోని జనగామ జిల్లాలో తెరాస, భాజపా నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఉద్యోగాల భర్తీపై సీఎం ప్రకటనతో తెరాస శ్రేణులు సంబురాలు నిర్వహిస్తుండగా ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది.
ఏం జరిగిందంటే..?
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో నిరుద్యోగుల కోసం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ తెరాస శ్రేణులు పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ సంబురాలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలోనే తెరాస, భాజపా నాయకులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు ఇరువర్గాల వారిని అదుపులోకి తీసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.
ఇదీ చదవండి:ఏపీలో "కేసీఆర్ జిందాబాద్".. తెలంగాణ సీఎంకు పాలాభిషేకం..!