సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న సీజేఐ.. 8 గంటల తర్వాత యాదాద్రి చేరుకుంటారు.
బాలాలయంలో లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. వేదపండితుల ఆశీర్వచనం అనంతరం.. పునరుద్ధరించిన ఆలయాన్ని జస్టిస్ ఎన్వీరమణ సందర్శిస్తారు. ప్రెసిడెన్షియల్ విల్లా సూట్లతో పాటు ఆలయనగరిని పరిశీలించి హైదరాబాద్ తిరుగు పయనమవుతారు.