ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

nv ramana: ఇంటర్ విద్యార్థికి శుభాశీస్సులు తెలుపుతూ... సీజేఐ ఎన్వీ రమణ లేఖ - ఏపీ తాజా వార్తలు

జస్టిస్ ఎన్వీ రమణ(nv ramana) విజయవాడ విద్యార్థికి శుభాశీస్సులు తెలుపుతూ.. లేఖ రాశారు. విద్యాభ్యాసం నిరాటంకంగా కొనసాగిస్తూ, ఎంచుకున్న రంగంలో కీర్తి శిఖరాలు అధిరోహించాలని ఆకాక్షిస్తున్నానని లేఖలో పేర్కొన్నారు.

సీజేఐ ఎన్వీ రమణ లేఖ
సీజేఐ ఎన్వీ రమణ లేఖ

By

Published : Jun 8, 2021, 8:40 PM IST

Updated : Jun 8, 2021, 10:58 PM IST

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ(nv ramana) విజయవాడ విద్యార్థికి శుభాశీస్సులు తెలుపుతూ.. లేఖ రాశారు. సర్వోన్నత న్యాయపీఠాన్ని అధిరోహించినందుకు అభినందనలు తెలుపుతూ... నగరానికి చెందిన ఇంటర్ విద్యార్థి పొట్లూరి దర్శిత్ జస్టిస్ ఎన్వీ రమణ(nv ramana)కు స్వదస్తూరితో తెలుగులో రెండు పేజీల లేఖ రాశాడు. దీనికి జస్టిస్ ఎన్వీ రమణ ప్రత్యుత్తరం పంపారు. "చక్కటి తెలుగులో రాసిన లేఖ నాకు అపరిమితమైన ఆనందాన్ని కలిగించింది. విద్యాభ్యాసం నిరాటంకంగా కొనసాగిస్తూ, ఎంచుకున్న రంగంలో కీర్తి శిఖరాలు అధిరోహించాలని ఆకాక్షిస్తున్నా." అని లేఖలో పేర్కొన్నారు.

Last Updated : Jun 8, 2021, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details