CJI NV Ramana 2nd day tour in AP: విజయవాడ నోవాటెల్ హోటల్లో క్రిస్మస్ వేడుకల్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. హోటల్‌కు విచ్చేసిన బిషప్‌లు.. క్రిస్మస్ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణతో కేక్ కట్ చేయించారు. అనంతరం బిషప్‌లకు.. సీజేఐ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపి, కేక్ తినిపించారు. ఈ వేడుకల్లో సీజేఐతోపాటుగా.. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు జడ్జిలు, న్యాయవాదులు పాల్గొన్నారు.
చిన్న జీయర్ స్వామి ఆశ్రమ పండితులు సైతం జస్టిస్ రమణను కలిశారు. వేద పండితులు ఆయనకు ఆశీర్వాదాలు అందించారు. ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, పలువురు ప్రజాప్రతినిధులు కూడా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిశారు.