కృష్ణా జిల్లా కంచికచర్లలోని దేవినేని ఉమామహేశ్వరరావు నివాసంలో.. ఆయన తండ్రి శ్రీమన్నారాయణ చిత్రపటానికి సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పూలమాలవేసి నివాళులర్పించారు. శ్రీమన్నారాయణ మృతిపట్ల సంతాపం తెలిపిన సీజేఐ.. కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు. దేవినేని ఉమామహేశ్వరరావు, ఆయన తల్లిని పరామర్శించారు.
మాజీ మంత్రి దేవినేని కుటుంబానికి.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పరామర్శ - cji visited ex minister devineni family
మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబాన్ని.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పరామర్శించారు. ఇటీవల దేవినేని ఉమ తండ్రి శ్రీమన్నారాయణ మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ ఇంటికి వెళ్లిన సీజేఐ.. ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మాజీ మంత్రి దేవినేని కుటుంబాన్ని పరామర్శించిన సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
TAGGED:
ap latest news