IAMC Hyderabad Inauguration : ఐఏఎంసీ ఏర్పాటుకు హైదరాబాద్ అన్ని విధాలా అనుకూలమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఉద్ఘాటించారు. ఐఏఎంసీ ఏర్పాటుకు ప్రతిపాదించగానే అంగకీరించిన సీఎం కేసీఆర్ తక్కువ కాలంలో మంచి వసతులతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రాన్ని (ఐఏఎంసీ) జస్టిస్ ఎన్వీ రమణ, సీఎం కేసీఆర్ హైదరాబాద్‌లో ప్రారంభించారు.
IAMC Hyderabad Inauguration : దేశంలోనే మొదటి అంతర్జాతీయ ఆర్బిట్రేషన్, మీడియేషన్ కేంద్రం (ఐఏఎంసీ) హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. నానక్‌రాంగూడ ఫొనిక్స్ వీకే టవర్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాన్నిసుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాంగణాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించారు. అనంతరం ఐఏఎంసీలో వసతులను పరిశీలించారు. అనంతరం ఇద్దరూ కలిసి ఐఏఎంసీని ప్రారంభించి వసతులను పరిశీలించారు. ప్రస్తుతం తాత్కాలిక భవనంలో ఏర్పాటవుతున్న ఈ కేంద్రానికి శాశ్వత భవనం కోసం భూకేటాయింపులు కూడా పూర్తయ్యాయి.
International Center for Arbitration and Mediation Hyderabad : దేశంలో అంతర్జాతీయ స్థాయి ఆర్బిట్రేషన్ కేంద్రాలు లేనందున హైదరాబాద్‌లో ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద జూన్ 14న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిపాదించారు. కేసీఆర్ వెంటనే అంగీకరించి యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు.