రబీలో ఈ ఏడాది 28 లక్షల టన్నుల ధాన్యం కొన్నామని పౌరసరఫరాలశాఖ కమిషనర్ కోన శశిధర్ (kona shashidhar) స్పష్టం చేశారు. కొనుగోళ్లలో మోసాలు జరగకుండా ఆడిటింగ్ చేస్తున్నామన్నారు. రైతులకు (Farmers) మూడు వారాల్లో నగదు చెల్లింపులు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ చేస్తున్నామని..,గతేడాది 34 లక్షల టన్నుల ధాన్యం (paddy) కొనుగోలు చేశామననారు.
"గతేడాది రబీలో రైతులకు రూ.6,331 కోట్లు చెల్లించాం. రైతుభరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు కూపన్లు ఇస్తున్నాం. ఈ-క్రాప్ బుకింగ్ వల్ల దళారుల మోసాలు ఉండవు. గతంలో వెబ్‌ల్యాండ్‌లోనే నామమాత్రంగా ఈ-క్రాప్ బుకింగ్ జరిగేది. తడిచిన ధాన్యం కూడా కొని రైతులు నష్టపోకుండా చూస్తున్నాం. కేంద్రం నుంచి బయానాగా రూ.3,229 కోట్లు రావాల్సి ఉంది. ధాన్యం కొనుగోలుకు రాష్ట్రం ఇప్పటికే రూ.1,637 కోట్లు చెల్లించింది." -కోన శశిధర్, పౌరసరఫరాల శాఖ కమిషనర్