ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

చంద్రబాబు ఇలాంటి సాహసాలు ఏనాడైనా చేశారా?- కారుమూరి

Civil Supplies Minister: పౌరసరఫరాల శాఖ మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన కారుమూరి నాగేశ్వరరావు ఆయన స్వగ్రామానికి వెళ్లారు. ఆయనకు కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద వైకాపా శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అభయాంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సీఎం జగన్ కేబినెట్​లో బడుగు, బలహీన వర్గాలకు 70 శాతం చోటు కల్పించి మంచి పేరు సంపాదించుకున్నారన్నారు.

Civil Supplies Minister
చంద్రబాబు ఇలాంటి సాహసమైన నిర్ణయాలు ఏనాడైనా తీసుకున్నాడా

By

Published : Apr 14, 2022, 8:28 PM IST

Civil Supplies Minister: బీసీల్లోని వివిధ కులాలను వెలికితీసి వారికి మంత్రులు, కార్పొరేషన్ పదవులు కట్టబెట్టిన ఘనత భారతదేశంలో జగన్మోహన్ రెడ్డికే ఉందని పౌరసరఫరాల మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొనియాడారు. మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం స్వగ్రామం బయలుదేరి వెళ్లారు. ఆయనకు కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్ వద్ద వైకాపా శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అభయాంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

సీఎం జగన్ కేబినెట్​లో బడుగు, బలహీన వర్గాలకు 70 శాతం చోటు కల్పించి మంచి పేరు సంపాదించుకున్నారన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల ఇండస్ట్రీలో తనవాళ్లకే మంత్రి పదవులు కట్టబెట్టారు తప్ప, ఇలాంటి సాహసమైన నిర్ణయాలు ఏనాడైనా తీసుకున్నారా? అని ప్రశ్నించారు. రేషన్​కు నగదు బదిలీ అనేది కార్డుదారుడి ఇష్టమని, తీసుకోవాలా.. వద్దా అనేది వారిపైనే ఆధారపడి ఉంటుందని అన్నారు. ఈ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా కొన్ని మున్సిపాలిట్లో అమలు చేస్తామని మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి: జగన్​కు దమ్ముంటే.. వారిని సీఎం చేయాలి: జీవీఎల్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details