విజయవాడలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేశారు. మద్యం వద్దు... భోజనం కావాలి అని నినాదించారు. 45 రోజులుగా కరోనాతో ప్రజలందరూ పనులు మానుకొని ఇళ్లలోనే ఉంటున్నారన్నారు. అధికారంలో ఉన్న కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో వైకాపా ప్రజలను ఆదుకునే పరిస్థితి లేదని సీఐటీయూ నగర నాయకులు దుర్గారావు ధ్వజమెత్తారు.
.45 రోజులు కరోనా ప్రభావంతో ఇంట్లోనే ఉండి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకున్న తరుణంలో.. మద్యం అమ్మకాలు మొదలు పెట్టిన కారణంగా.. అంతా నీరు కారిపోయిందన్నారు. కరోనా వ్యాధి వ్యాప్తి చెందుతుందని ప్రజలు భయపడుతున్నారన్నారు. మద్యం కాదని.. ముందు పేదలకు అన్నం పెట్టాలని డిమాండ్ చేశారు.