కేంద్ర ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంస్థ (సీపెట్) లాంగ్ టర్మ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ పరీక్షకు దరఖాస్తు గడువు ఈనెల 30తో ముగియనున్నట్లు విజయవాడ సీపెట్ డైరెక్టర్ వి.కిరణ్ కుమార్ వెల్లడించారు. విజయవాడ సీపెట్ లో ఈసారి 300 మంది విద్యార్థులకు లాంగ్ టర్మ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. డీపీఎమ్టీ, డీపీటీ, డిప్లొమా కోర్సులకు 240 సీట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాకు 60 సీట్లు కేటాయించామన్నారు. దరఖాస్తులు కేవలం ఆన్ లైన్ విధానంలోనే చేసుకోవాలని డైరెక్టర్ సూచించారు. జనరల్ కేటగిరి విద్యార్థులు 750 రూపాయలు .. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 300 రూపాయల దరఖాస్తు రుసుము చెల్లించాలన్నారు. దేశవ్యాప్తంగా జూలై 7న సీపెట్ జేఈఈ పరీక్ష నిర్వహించనున్నారు. ప్లాస్టిక్ ఇంజనీరింగ్ రంగం అభివృద్ధి చెందుతుండడంతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని... అర్హత ఉన్నవారు లాంగ్ టర్మ్ కోర్సుల కోసం నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు.
సీపెట్ జేఈఈ దరఖాస్తు గడువుకు... చివర తేదీ జూన్ 30 - కేంద్ర ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంస్థ(సీపెట్)
సీపెట్ లాంగ్ టర్మ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ పరీక్షకు దరఖాస్తు గడువు ఈ నెల30తో ముగియనున్నట్లు విజయవాడ సీపెట్ డైరెక్టర్ వి.కిరణ్ కుమార్ వెల్లడించారు.
విజయవాడ సీపెట్ డైరెక్టర్ వి.కిరణ్ కుమార్