జల వివాదాలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్యపూర్వక వాతావరణంలో పరిష్కరించుకుంటారని సినీ నటుడు పోసాని కృష్ణ మురళి జోస్యం చెప్పారు. సీఎం కేసీఆర్ చాలా నిజాయతీ పరులని, ప్రాజెక్టుల్లో అక్రమాలకు పాల్పడ్డారనేది అవాస్తవమని పోసాని వెల్లడించారు. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని ఆయన పేర్కొన్నారు.
'జల వివాదాలను ఇరువురు సీఎంలు పరిష్కరించుకుంటారు' - పోసాని కృష్ణమురళీ
జల వివాదాలను ఇరువురు సీఎంలు సామరస్యంగా పరిష్కరించుకుంటారని సినీ నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ గురించి ప్రతిపక్షాలు చెప్పేవన్నీ అవాస్తవాలనేనని.. విశ్వసనీయత లేని వారే తెరాసపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
సినీ నటుడు పోసాని కృష్ణమురళి ప్రెస్‌మీట్
విశ్వసనీయత లేని వ్యక్తులు తెరాసపై ఆరోపణలు చేస్తున్నారని సినీ నటుడు పోసాని కృష్ణ మురళి విమర్శించారు. తెలంగాణ సీఎం కేసీఆర్, యువనేత కేటీఆర్ గురించి విపక్షాలు చెప్పేవన్నీ అవాస్తవాలన్నీ పోసాని కొట్టిపారేశారు. కేటీఆర్, హరీశ్‌రావు తెలంగాణకు రెండు కళ్ల వంటివారని ఆయన చెప్పారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్... కేటీఆర్‌ను రాజీనామా చేయమనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ఇవీ చూడండి:పల్లంలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ