ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'బడ్జెట్ పెట్టుబడులు, ఆర్థికవృద్ధికి తోడ్పడుతాయి..' - బడ్జెట్​పై సీఐఐ ఏపీ ఛైర్మన్ డి.రామకృష్ణ కామెంట్స్

కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్​ ద్వారా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు మంచి అడుగులు పడతాయని సీఐఐ ఏపీ ఛైర్మన్‌ డి. రామకృష్ణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీర్ఘకాలిక ప్రయోజనాలపై కేంద్రం దృష్టి సారించిందన్నారు.

బడ్జెట్ పెట్టుబడులు, ఆర్థికవృద్ధికి తోడ్పడుతుంది
బడ్జెట్ పెట్టుబడులు, ఆర్థికవృద్ధికి తోడ్పడుతుంది

By

Published : Feb 1, 2021, 6:49 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ పెట్టుబడులు, ఆర్థికవృద్ధికి తోడ్పడుతాయని కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీస్‌ ఏపీ ఛైర్మన్ డి.రామకృష్ణ వ్యాఖ్యానిచారు. వార్షిక పద్దులో కేంద్రం దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి పెట్టిందన్నారు. మౌలిక వసతులపై పెట్టుబడులు ఏ నాటికీ వృథా కావని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించటం శుభపరిణామమన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు మంచి అడుగులు పడతాయన్నారు. పన్నుల్లో రాయితీలు ఇవ్వకపోవడం సామాన్య, మధ్యతరగతి వర్గాలకు కొంత నిరాశ కలిగించేదిగా కనిపించినా..ఈ విధానంలో మార్పులు చేయకపోవడం ఊరట కలిగించే విషయమని చెప్పారు.

ఇదీచదవండి: పద్దు: ఆరోగ్యం, మౌలిక వసతులకే ప్రాధాన్యం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details