ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Bail To Ashok Babu: తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్ట్​.. విడుదల - tdp leader Ashok babu news

Bail To MLC Ashok Babu
ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు బెయిల్‌ మంజూరు

By

Published : Feb 11, 2022, 11:01 PM IST

Updated : Feb 12, 2022, 7:53 AM IST

22:21 February 11

రూ.20 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు

తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు బెయిల్‌ మంజూరు

Bail Granted To MLC Ashok Babu: తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు బెయిల్‌ వచ్చింది. అర్ధరాత్రి సీఐడీ కోర్టు బెయిల్‌ మంజూరు చేయగా... ఆ తర్వాత కొద్దిసేపటికి ఆయన విడుదలయ్యారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కక్షలకు స్వస్తి చెప్పకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదని అశోక్‌బాబు హెచ్చరించారు.

Arrest: వాణిజ్యపన్నుల శాఖలో పనిచేస్తున్నప్పుడు పదోన్నతి కోసం తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారనే ఆరోపణలపై అరెస్టైన తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్‌బాబుకు విజయవాడలోని సీఐడీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. గురువారం అర్ధరాత్రి ఆయన్ను అరెస్టు చేసిన సీఐడీ అధికారులు.. గుంటూరు ప్రాంతీయ కార్యాలయానికి తరలించి ప్రశ్నించారు. అక్కడి నుంచి శుక్రవారం రాత్రి విజయవాడలోని సీఐడీ ఇన్‌ఛార్జ్‌ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. మొదట బెయిలబుల్‌ సెక్షన్స్‌ నమోదు చేసిన అధికారులు.. ఆ తర్వాత ఉద్దేశపూర్వకంగా 467 సెక్షన్‌ పెట్టారని అశోక్‌బాబు తరఫు న్యాయవాదులు వాదించారు. రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే అరెస్ట్‌ చేశారని అన్నారు. ఇటీవలే అశోక్‌బాబు గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారని.. అందువల్ల ఆయనకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. ఉద్యోగంలో ఉండగా పదోన్నతి కోసం తప్పుడు ధ్రువపత్రం సమర్పించారని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. 467 సెక్షన్‌ పెట్టినందున రిమాండ్‌కు పంపాలని విన్నవించారు. ఇరువైపు వాదనలు విన్న సీఐడీ న్యాయమూర్తి.. అర్ధరాత్రి అశోక్‌బాబుకు బెయిల్‌ మంజూరు చేశారు. కోర్టు ఆదేశం మేరకు రూ. 20 వేల చొప్పున ఇద్దరి పూచీకత్తులు సమర్పించి అశోక్‌బాబు విడుదలయ్యారు.

రాజకీయ దురుద్దేశంతోనే తనను అరెస్ట్‌ చేశారని.. దీనివెనక పీఆర్సీ సాధన సమితిలోని కొందరు నేతలున్నారని అశోక్‌బాబు ఆరోపించారు. అశోక్‌బాబుపై తప్పుడు కేసులు పెట్టిన వారిపై ప్రైవేటు కేసులు వేస్తామని తెలుగుదేశం సీనియర్‌ నేత దేవినేని ఉమ చెప్పారు.

అప్రజాస్వామిక అరెస్టు: తెదేపా

పీఆర్సీకి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఉద్యమిస్తున్న వారిని బెదిరించేందుకే ఎమ్మెల్సీ అశోక్‌బాబును అప్రజాస్వామికంగా అరెస్టు చేశారని తెదేపా నేతలు మండిపడ్డారు. ముందస్తు నోటీసులివ్వకుండా సీఐడీ పోలీసులు అశోక్‌బాబును అరెస్టు చేసి తరలించటాన్ని వారు తప్పుబట్టారు. శుక్రవారం వస్తే ఎవరిని జైలుకు పంపుదామా? అని వైకాపా ప్రభుత్వం ఎదురుచూస్తోందని విమర్శించారు.

తెదేపా నేతలపై కేసులు నమోదు..

గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో ఆశోక్‌బాబును పరామర్శించేందుకు వెళ్లిన తెలుగుదేశం నేతలపై.... సెక్షన్‌ 151 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఆందోళన చేశారంటూ... దేవినేని ఉమ, తెనాలి శ్రావణ్‌ కుమార్‌, నసీర్‌, డేగల ప్రభాకర్‌, సుఖవాసి శ్రీనివాస్, కనపర్తి శ్రీనివాస్ సహా 60 మందిపై కేసులు పెట్టారు. ఇందులో దేవినేని ఉమను మొదటి నిందితుడిగా చేర్చారు.

ఇదీ చదవండి:

Last Updated : Feb 12, 2022, 7:53 AM IST

ABOUT THE AUTHOR

...view details