కరోనా కేవలం జ్వరం మాత్రమేనని చెప్పే వ్యక్తి గురించి ఏమనాలని తెదేపా అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఏపీ దక్షిణభారత్లో మెుదటి స్థానంలో ఉందని చంద్రబాబు విమర్శించారు. కరోనాతో కలసి జీవించాలంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. ఈ సందర్భంగా జగన్ వ్యాఖ్యల వీడియోను ట్విట్టర్లో చంద్రబాబు పోస్టు చేశారు.
కరోనా జ్వరమనే వ్యక్తి గురించి ఏమనాలి: చంద్రబాబు - సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు
కరోనా జీవితంలో భాగమేనన్న సీఎం జగన్ అనాలోచిత వ్యాఖ్యలు తనను దిగ్భ్రాంతికి గురి చేశాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు అన్నారు.
![కరోనా జ్వరమనే వ్యక్తి గురించి ఏమనాలి: చంద్రబాబు chndrababu fire to cm jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6968219-1106-6968219-1588038119939.jpg)
సీఎం జగన్ పై చంద్రబాబు విమర్శలు