ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CBN On Jagan Govt: ఈ ప్రజా వ్యతిరేకత గతంలో ఎప్పుడూ చూడలేదు: చంద్రబాబు - జగన్​పై చంద్రబాబు కామెంట్స్

CBN Fire On Jagan: ఈ ప్రభుత్వంపై ఉన్న ప్రజా వ్యతిరేకత గతంలో ఎప్పుడూ చూడలేదని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఓటీఎస్ పేరుతో పేదల నుంచి బలవంతంగా డబ్బు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఈ ప్రజా వ్యతిరేకత గతంలో ఎప్పుడూ చూడలేదు
ఈ ప్రజా వ్యతిరేకత గతంలో ఎప్పుడూ చూడలేదు

By

Published : Dec 3, 2021, 9:28 PM IST

CBN Fire On YCP Govt: మున్సిపల్ ఎన్నికల్లో తెదేపాకు ఓట్ల శాతం పెరగటం శుభపరిణామమని పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. జగన్ పాలనలో అరాచకం రాజ్యమేలుతోందని..,ఓటీఎస్ పేరుతో పేద ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు గుంజుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ అధికార దుర్వినియోగం, డబ్బు, అక్రమ కేసులతో అప్రజాస్వామికంగా గెలిచారని ఆరోపించారు. జగన్​పై ఉన్న ప్రజా వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వంపైనా చూడలేదన్నారు. గోదావరి జిల్లాల్లో అరాచకాలు సృష్టిస్తే ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారని చెప్పారు.

వైకాపా ఎంత బెదిరించినా..క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని నేతలకు సూచించారు. జగన్ అవినీతి, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించటం ఖాయమన్నారు. ఏ స్థాయిలోనైనా నాయకులు సరిగా పనిచేయని చోట కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని తేల్చి చెప్పారు. నాయకులు ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details