ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం పేరుతో రైతులను మోసం చేస్తున్నారు' - చింతకాయల అయ్యన్నపాత్రుడు తాజా వార్తలు

వైఎస్సార్ సున్నావడ్డీ పథకం పేరుతో సీఎం జగన్ రైతులను మోసం చేస్తున్నారని తెదేపా నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. 18 నెలల పాలనలో ప్రజలకు ఏంచేశారో కూర్చుని ఆలోచించాలని జగన్​కు సలహా ఇచ్చారు.

ayyannapatrudu
అయ్యన్న పాత్రుడు, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు

By

Published : Nov 22, 2020, 2:51 PM IST

సీఎం జగన్మోహన్ రెడ్డి జీవితమంతా అబద్ధాలు, మోసాలేనని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి రాకముందు చెప్పిన అబద్ధాలు, చేసిన మోసాలనే.. ముఖ్యమంత్రి అయ్యాకా కొనసాగిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్​కు సలహాలు ఎవరిస్తున్నారో తెలియదుగానీ, అంతిమంగా నష్టపోయేది ఆయనేనని అయ్యన్నపాత్రుడు అన్నారు.

విజయసాయిరెడ్డి శకుని లాంటి వారని.. శకుని సలహాలు విన్నవారెవరూ బాగుపడలేదని విమర్శించారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం పేరుతో, ప్రకటనల ముసుగులో రైతులను జగన్ దారుణంగా మోసగిస్తున్నాడని ఆరోపించారు. లక్ష రూపాయలు అంతకులోపు రుణం తీసుకొని, సకాలంలో చెల్లించినవారికే సున్నావడ్డీ అమలవుతుంది షరతు పెట్టడం తగదన్నారు. 18నెలల పాలనలో ప్రజలకు ఏంచేశారో జగన్ ఒక్కసారి కూర్చొని ఆలోచించుకుంటే మంచిదని హితవుపలికారు.

ABOUT THE AUTHOR

...view details