2016లో జరిగిన కృష్ణా పుష్కరాలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరిగి ఎలాంటి అక్రమాలు తేలలేదని నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ విచారణ చేపట్టడం కక్షసాధింపేనని వ్యాఖ్యానించారు.
ఉపాధిహామీ పనులకు సంబంధించి విచారణ పేరుతో బిల్లులు చెల్లించకుండా చేశారని మండిపడ్డారు. తెలుగుదేశం మద్దతుదారులను లొంగదీసుకునేందుకే బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని చినరాజప్ప ఆరోపించారు.