విజయవాడ వాసులకు చైనా రుచులు - విజయవాడలో చైనీస్ ఫుడ్ ఫెస్ట్
విజయవాడ హోటల్ గేట్‌వేలో ఘుమఘుమలాడే చైనా వంటకాలతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 28 వరకు ఈ ఫెస్టివల్ జరగనుంది.
విజయవాడ వాసులకు చైనా రుచులు
విజయవాడ హోటల్ గేట్‌వేలో చైనా వంటకాలతో ప్రత్యేక ఫుడ్‌ఫెస్టివల్‌ను ప్రారంభించారు. ఈ నెల 28వ తేదీ వరకు పసందైన చైనా వంటల రుచులను నగరవాసులకు అందుబాటులో ఉంచుతున్నట్లు హోటల్ నిర్వాహకులు తెలిపారు. మింగ్ గార్డెన్ ఫుడ్ ఫెస్టివల్ పేరిట చైనా వంటకాల రుచులను తయారుచేయిస్తున్నామన్నారు. సుమారు 50 నుంచి 60 రకాల శాఖాహార, మాంసాహార వంటకాలు ఈ ఫెస్టివల్‌లో అందుబాటులో ఉంచారు.