కరోనా వ్యాపిస్తున్నా.. ముఖ్యమంత్రి అలసత్వం ప్రదర్శిస్తున్నారని నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. మంత్రులు, వైకాపా ప్రజాప్రతినిధులెవ్వరూ లాక్డౌన్ నిబంధనలు పాటించట్లేదని ఆరోపించారు. అన్ని రాష్ట్రాలు ప్రజారోగ్యం దృష్ట్యా లాక్డౌన్ పెంచాలనే భావనలో ఉంటే జగన్ మాత్రం ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం, ప్రజలు బాగుపడాలంటే కరోనా నివారణపై జగన్ శ్రద్ధ చూపాలని హితవు పలికారు.
'సీఎం జగన్ ఎలాగైనా ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారు' - ఎన్నికల నిర్వహణపై జగన్ దృష్టి న్యూస్
కరోనాను సీఎం జగన్ సీరియస్గా తీసుకోవట్లేదని తెదేపా సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. పెద్దఎత్తున కరోనా విరాళాలు వస్తుంటే.. వాటిని ప్రకటనలకే ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
chinarajappa on jagan