వైకాపా నేతల లబ్ధి కోసమే ఇళ్ల పట్టాల కార్యక్రమం చేపట్టారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన జగన్... ఇప్పుడు షరతులు వర్తిస్తాయి అంటున్నారని విమర్శించారు. పేదలు కట్టుకున్న ఇళ్లకు బిల్లులు మంజూరు చేయకుండా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెదేపా వర్చువల్ ఆందోళనలు చేపట్టినట్లు చినరాజప్ప తెలిపారు.
వైకాపా నేతల కోసమే.. ఇళ్ల పట్టాల కార్యక్రమం: చినరాజప్ప - chinarajappa on ysrcp government
వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెదేపా వర్చువల్ ఆందోళనలు చేపట్టారు. పేదలు కట్టుకున్న ఇళ్లకు బిల్లులు మంజూరు చేయకుండా వేధిస్తున్నారని మాజీమంత్రి చినరాజప్ప ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైకాపా ప్రభుత్వంపై చినరాజప్ప